Kitchenvantalu

Rava Pulihora:ఎప్పుడూ రైస్ పులిహోరనే కాకుండా రవ్వతో కూడా రుచికరమైన పులిహోరని తయారు చేసుకోవచ్చు..

Rava Pulihora:రవ్వ పులిహోర..అన్నంతో పులిహోరా తరుచుగా చేస్తునే ఉంటాం. రవ్వ తో కూడ పులిహోర చేసి చూడండి.ఎప్పుడు ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇలా పులిహోరా ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం రవ్వ – 1 కప్పు
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్
కరివేపాకు – ½ కప్పు
పచ్చిమిర్చి – 3
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 4
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 2 స్పూన్స్
శనగపప్పు – 2 టీ స్పూన్స్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఒక కప్పు రవ్వకోసం 1 ½ కప్పు నీళ్లను వేడి చేసుకోవాలి.
2.మరుగుతున్న ఎసరులో రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
3.మూతవేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఉప్మాని వేరొక ప్లేట్ లోకి వేసి చల్లారనివ్వాలి.

4.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేయాలి. ఆ తర్వాత పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు,పసుపు,పచ్చిమిర్చి వేసి పోపును వేపుకోవాలి.
5.చల్లారిన రవ్వ ఉప్మాలోకి వేగిన తాలింపును వేసి కలుపుకోవాలి.
6.నిమ్మరసం వేసుకోని బాగా మిక్స్ చేసుకుంటే రవ్వ పులిహోర రెడీ.