Spring Onions with Egg Curry:ఉల్లికాడలతో ఎగ్ కర్రీ ఇలా చేస్తే రుచి సూపర్ గా ఉంటుంది
Spring Onions with Egg Curry:స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ రెసిపీ.. ఎగ్ ఎంత స్పెషల్ అయినా రెగ్యులర్ గా చేస్తే బోర్ కొడుతుంది. ఈసారి స్ప్రింగ్ ఆనియన్స్ తో ఎగ్ కలిపి చేయండి.
కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు – 4
నూనె – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఉల్లిపాయలు – 1
స్ప్రింగ్ ఆనియన్స్ – 2 కప్పులు
పచ్చిమిర్చి – 6
ఉప్పు – 1 ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు
తయారీ విధానం
1.ముందుగా ఉడికించిన గుడ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి ఆవాలు,జీలకర్ర,ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్,పచ్చిమిర్చి,పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
4.అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక కారం,కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
5.చివరగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ.