Beauty TipsHealth

Hair Care Tips:వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలకుండా కుదుళ్ల నుండి బలంగా పెరుగుతుంది

Fenugreek Seeds Home Remedies in Telugu :వాతావరణంలో మార్పులు, కాలుష్యం,ఒత్తిడి, మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనబడుతోంది. ఈ సమస్యను తగ్గించుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

దీనికోసం ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల మెంతి పిండి, రెండు స్పూన్ల వేపాకు పొడి, రెండు స్పూన్ల ఉసిరి కాయ పొడి, రెండు పెద్ద గేరేటెల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంటయ్యాక నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

మెంతి పిండి లో ఉండే నికోటిన్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. వేపాకులలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన తలలో చుండ్రు దురద తగ్గించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఉసిరి పొడి జుట్టు రాలడం, తెల్ల జుట్టు రావటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తల పైన చర్మం శుభ్రంగా ఉండేలా చేస్తుంది.

ఇలా ఈ ప్యాక్ జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉంటే 2 సార్లు, తక్కువ ఉంటే ఒకసారి వేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తొలగిపోతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.