Diabetes:పరగడుపున 1 స్పూన్ గింజలను నానబెట్టి తింటే… ముఖ్యంగా షుగర్ ఉన్నవారు…
Sun Flower Seeds Health Benefits In telugu : ఈ మధ్య మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సన్ ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసు కుందాం. మనం రెగ్యులర్ గా సన్ ఫ్లవర్ ఆయిల్ తో వంటలు,కూరలు చేసుకుంటూ ఉంటాం.
సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదని ఎక్కువగా మనలో చాలా మంది వాడుతూ ఉంటారు. సన్ ఫ్లవర్ గింజలలో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలియక సన్ ఫ్లవర్ మొక్కలను కేవలం నూనె కోసం మాత్రమే పెంచుతూ ఉంటారు. ఈ గింజలు తింటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి సన్ ఫ్లవర్ గింజలు తినమని సిఫార్స్ చేస్తున్నారు. సన్ ఫ్లవర్ గింజలలో ఉండే లక్షణాలు డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
వీటిలో ఉన్న పోషకాలు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయడమే కాకుండా రక్తసరఫరా మెరుగుపరుస్తుంది. గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కాబట్టి సన్ ఫ్లవర్ గింజలు తినటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇవి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి.
ఈ గింజలలో విటమిన్ ఇ, జింక్ మరియు సెలీనియం సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ బి6 ఉండుట వలన మానసిక స్థితి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ గింజలలో థయామిన్ (విటమిన్ B1) ఉండుట వలన మన ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు మరియు కొవ్వులను శక్తిగా విభజించడంలో సహాయపడుతుంది. ఇవి కండరాల నిర్మాణానికి కూడా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.