Ravi Teja ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా…?
Ravi Teja idiot Movie Facts In telugu : పూరి జగన్నాథ్ – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో 2002 లో వచ్చిన ఇడియట్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాతో Ravi Teja కు మాస్ ఫాలోయింగ్ వచ్చింది. దాంతో వెనుతిరిగి చుసుకోకుడా కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకు సాగింది.
ఈ సినిమా కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ ఇది. ఈ సినిమాకి డైరెక్షన్ పూరి జగన్నాథ్ చేసాడు. ఆ సినిమా పేరే పునీత్ రాజ్ కుమార్ కు నిక్ నేమ్ గా మారిపోయింది. ఈ సినిమాను రవి తేజ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోల వద్దకు వెళ్ళింది. వారు రిజెక్ట్ చేసాక Ravi Teja వద్దకు వచ్చింది.
వెంటనే రవితేజ Ok చేయటంతో సూపర్ హిట్ రవితేజ ఖాతాలో పడింది.
అప్పు సినిమా పూరి జగన్నాథ్ కి మంచి హిట్ ఇవ్వడంతో అదే జోష్ లో వెంటనే ఈ సినిమాని తెలుగులో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించారు. ఇక ఈ స్టోరీని మహేష్ బాబుకి చెబితే వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కారణాలతో రిజెక్ట్ చేసారు.