Kitchenvantalu

Bitter Gourd Fry:పోషక విలువలు పోకుండా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేలా కాకరకాయ వేపుడు

Bitter Gourd Fry:కాకరకాయ ఫ్రై.. కాకరకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వారంలో ఒక సారైనా కాకరకాయ ప్లాన్ చేసుకోండి.ఆరోగ్యాన్ని పెంచుకోండి.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – 1 ½ స్పూన్
ఉల్లిపాయలు – ½ కప్పు
పసుపు – ¼ టీ స్పూన్
కారం – 1 స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
నువ్వుల పొడి – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7-8

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను గుండ్రంగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి కాకరకాయ ముక్కలను వేసి వేపుకోవాలి.
3.అందులోకి ఉప్పు వేసి చేదు పోయే వరకు వేపుకోవాలి.
4.కాకరకాయలు వేగాక ఉల్లిపాయలు వేసి ,పసుపు వేసి మూతపెట్టుకోని వేపుకోవాలి.
5.ఉల్లిపాయలు వేగాక కారం,ఉప్పు,ధనియాల పొడి,నువ్వుల పొడి ,వేసి లో ఫ్లేమ్ పై పది నిమిషాలు ఉడికించుకోవాలి.
6.వెల్లుల్లి రెబ్బలను బరకగా దంచుకోని కాకరకాయ లోవేసి ఐదునిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.