Cracked heels:ఈ చిట్కా పాటిస్తే చాలు కేవలం 2 రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయం అవుతాయి
Cracked heels Home Remedies: ఈ చలికాలంలో పాదాల పగుళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో పాదాలపై శ్రద్ద ఎక్కువగా పెట్టవలసిన అవసరం ఉంది. పాదాల పగుళ్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా పగుళ్ళ మధ్య దుమ్ము,ధూళి పెరుకుపోయి సమస్య ఎక్కువ అవుతుంది.
సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నాలు చేయాలి.మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. పాదాల పగుళ్లు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా పాదాల పగుళ్ళ నుండి బయట పడవచ్చు.
ఈ చిట్కా కోసం రెండు నిమ్మకాయలను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మిద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి… నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, కట్ చేసి పెట్టిన నిమ్మకాయ ముక్కలు వేసి 7 నుంచి 9 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన వాటర్ ను ఒక టబ్ లో వేసుకోవాలి.
అలాగే టబ్ లోకి సగానికి పైగా గోరువెచ్చని నీటిని వేసుకోవాలి. ఒక స్పూన్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ రెగ్యులర్ షాంపూ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లో పాదాలను కనీసం ఇరవై నిమిషాల పాటు ఉంచి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో ఒక స్పూన్ వాసెలిన్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా తొందరగా పాదాల పగుళ్ళ నుండి బయట పడవచ్చు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ సీజన్ లో ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.