Kitchenvantalu

Munagaku paratha:పోషకాల మునగాకు పరాటా… చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు

Munagaku paratha:మునగాకు పరాటా..మునగ యొక్క ప్రయోజనాలు అందరికి తెల్సిందే.మునగ కాయలు,ఆకులు ,రెండు ఆరోగ్యాన్నిస్తాయి.మునగాకు తో పరాటా చాలా హెల్తీ ఈ సారీ ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
మునగాకు – 1 కప్పు
గోధుమ పిండి -2 కప్పులు
ఉప్పు – 1 స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
వాము – ¼ టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
పసుపు – ¼ టీ స్పూన్
ధనియాల పొడి – ½ స్పూన్
కారం – ½ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్

తయారీ విధానం
1.కప్పు గోధుమ పిండికి కప్పు మునగాకులను యాడ్ చేసుకోవాలి.
2.అందులోకి ఉప్పు,వాము,జీలకర్ర,పచ్చిమిర్చి,పసుపు ,ధనియాల పొడి ,కారం ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
3.కొద్దికొద్దిగా నీళ్లను వేస్తు పిండిని కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండిని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
5.చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్న పిండిని పొడి పిండి సాయంతో పరాటాలు గా వత్తుకోవాలి.
6.ప్యాన్ పై వేసి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుంటే మునగాకు పరాటా రెడీ.