Carrot Rasam:ఆరోగ్యకరమైన, రుచికరమైన క్యారెట్ రసం ఇలా తయారు చేసి చూడండి
Carrot Rasam:క్యారేట్ రసం..కంటికి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే క్యారెట్ మనం తినే ఫుడ్ లో ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచిది. లంచ్ లోకి రసం చేస్తున్నాం అంటే అందులోకి క్యారేట్ రసం చేసుకోండి.
కావాల్సిన పదార్ధాలు
క్యారేట్స్- 2
టమటోలు – 2
జీలకర్ర – 1 స్పూన్
మెంతులు – ½ టీ స్పూన్
ఉప్పు – 2 స్పూన్స్
పచ్చిమిర్చి – 4
చింతపండు – 10-15 గ్రాములు
కారం – 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
మిరియాలు – 4-5
తాలింపు కోసం..
ఎండుమిరపకాయలు – 2
కరివేపాకు – ½ కప్పు
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని ధనియాలు వేపుకోవాలి.
2.అందులోకి జీలకర్ర,మెంతులు వేసి అన్నింటిని చల్లారిన తర్వాత మిక్సి జార్ లో వేసుకోని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
3.అందులోకి క్యారేట్ ముక్కలు,వెల్లుల్లి రెబ్బలు,చింతపండు వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు రసం కోసం కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి.
5.కరివేపాకు,పచ్చిమిర్చి,పసుపు వేసుకోని అందులోకి క్యారేట్ పేస్ట్ వేసి కలుపుకోవాలి.
6.మూడు నాలుగు నిమిషాలు ఉడికించాక సరిపడా నీళ్లను కలుపుకోవాలి.
7.అందులోకి కారం,ఉప్పు వేసి పది ,పన్నెండు నిమిషాలు మరిగించాలి.
8.చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారేట్ రసం రెడీ.