Kitchenvantalu

Capsicum Bajji:ఎప్పుడు చేసుకునే బజ్జీలు కాకుండా ఇలా క్యాప్సికమ్ తో బజ్జీలు చేయండి.. టేస్ట్ బాగుంటుంది

Capsicum Bajji:క్యాప్సికం బజ్జీ..రోజు తినే ఫుడ్స్ తో బోర్ వచ్చిందంటే ఉన్న ఐటెమ్స్ తో ఇంట్లోనే కాస్తా వెరైటీలు ట్రై చేసుకుంటే సరిపోతుంది.
క్యాప్సికం బజ్జీ తయారు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
క్యాప్సికం – 4
శనగ పిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టీ స్పూన్స్
ఉప్పు – 1 టీ స్పూన్
మిరియాల పొడి – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
వాము – ¼ టీ స్పూన్
జీలకర్ర – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా క్యాప్సికం చిన్న గా ఉంటే అలాగే బోండాలు వేసుకోవచ్చు.కాస్తా పెద్దగా అనిపిస్తే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.విత్తానాలను తొలగించుకోవాలి.
3.ఒక మిక్సింగ్ బౌల్ లోకి శనగ పిండి ,బియ్యం పిండి,ఉప్పు,కారం,పసుపు,పొడి చేసుకున్న వాము,జీలకర్ర వేసి కలుపుకోవాలి.
4.అందులోకి కొద్దికొద్దిగా నీళ్లను యాడ్ చేస్తు పిండిని ముద్దలు లేకుండా జారుగా కలుపుకోవాలి.
5.ఇప్పుడు స్టప్పింగ్ కోసం వేరొక గిన్నెలోకి తరిగిన ఉల్లిపాయలు,,క్యారేట్స్,కొత్తిమీర,మిరియాల పొడి,నిమ్మరసం వేసి కలుపుకోవాలి.

6.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి.
7.కలుపుకున్న పిండిలో చిటికెడు బేకింక్ సోడా వేసి క్యాప్సికం ముక్కను పిండిలో ముంచుకోవాలి.
8.పిండితో కోట్ చేసుకునే నూనేలో వేసి వేపుకోవాలి.
9.రెండు వైపులా ఎర్రగా బజ్జీని కాల్చుకోవాలి.
10.వేయించిన బజ్జీని మద్యలోకి కట్ చేసుకోని అందులోకి స్టఫ్ ని ఫిల్ చేసుకోని సర్వ్ చేసుకుంటే వేడి వేడి క్యాప్సికం బజ్జీ రెడీ.