Chiranjeevi:1988 లో బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపించిన చిరు సినిమాలు
Tollywood Hero Chiranjeevi Movies :ఖైదీ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న చిరంజీవి స్వయంకృషుతో మెగాస్టార్ అయ్యారు. మాస్ ఫాలోయింగ్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో 1988లో ఈయనకు వరుస హిట్స్ వచ్చాయి. 7సినిమాలు రిలీజ్ కాగా దాంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది.
ఆ ఏడాది జనవరి 14న మంచి దొంగ మూవీ రిలీజయింది. విజయశాంతి,సుహాసిని హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీని కె రాఘవేంద్రరావు తెరకెక్కించగా, విజయాన్ని అందుకుంది.ఇక ఖైదీ నెంబర్ 786కూడా ఈ ఏడాది మంచి హిట్ గా నిల్చింది. భానుప్రియ హీరోయిన్. రాజ్ కోటి మ్యూజిక్ గువ్వా గోరింకతో సాంగ్ ఇప్పటికీ ఆల్ టైం హిట్ గా ఉంది.
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా టాలీవుడ్ చరిత్రలో నిల్చిన మూవీ యముడికి మొగుడు. తన స్నేహితులు నారాయణరావు,హరిప్రసాద్,సుధాకర్ లు నిర్మాతలుగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తీసిన ఈ సినిమాలో చిరు నటన సూపర్భ్. యముడిగా సత్యనారాయణ, హీరోయిన్స్ గా రాధ, విజయశాంతి నటించారు. ఇదే మూవీని తమిళంలో రజనీకాంత్ తో తీస్తే ప్లాప్ అయింది.
అందుకే చిరంజీవి తప్ప ఈ పాత్రకు మరొకరు సూటవ్వరని చాటిచెప్పిన సినిమాగా నిల్చింది. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చి,ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. రాజ్ కోటి మ్యూజిక్ అదిరిపోయింది. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన మరణమృదంగం మూవీ కి ఇళయరాజా మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. రాధ,సుహాసిని హీరోయిన్స్. ఇందులో చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా బాగానే నటించాడు.
అలాగే కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో త్రినేత్రుడు మూవీ చిరంజీవి, భానుప్రియ జంటగా రిలీజై, మంచి ఓపెనింగ్స్ తెచ్చింది. నాగబాబు కూడా నటించాడు. అయితే లాంగ్ రన్ లో ఆకట్టుకోలేదు.ఇక కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన యుద్ధభూమి,కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన రుద్రవీణ నిరాశపరిచాయి. అయితే ఇళయరాజా సాంగ్స్ అదిరిపోయిన రుద్రవీణకు పలు అవార్డులు వచ్చాయి. ఫీల్ గుడ్ మూవీ చేసిన ఆనందం చిరంజీవికి దక్కింది.