Green Banana Fry :అరటికాయ తురిమి ఇలా ఫ్రై చెయ్యండి.. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది
Green Banana Fry :అరటి కాయ కూర..అరటి కాయను తురమి ఫ్రై చేసుకుంటే పప్పు చారు కాంబినేషన్ కి సైడ్ డిష్ సూపర్ గా సెట్ అవుతుంది. అరటి కాయ తురుము ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
అరటి కాయలు – 3
కారం పొడి – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 3-4
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
నిమ్మరసం – 1 ½ టీ స్పూన్
శనగలు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 1
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
కరివేపాకు – 1 కప్పు
తయారీ విధానం
1.ముందుగా అరటి కాయలను శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి.
2.కుక్కర్ లో వేసి అర కప్పు నీళ్లను కొద్దిగా నూనే వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
3.ఉడికిన అరటి కాయ చల్లారిన తర్వాత పొట్టును తొలగించి అరటి పండును తురుముకోవాలి.
4.తురమిన అరటి పండులో కారం,ఉప్పు,పసుపు వేసి కలుపుకోవాలి.
5.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి శనగ పప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి పోపును వేపుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి అరటి తురుము వేసి ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ పై ఉడికించి నిమ్మరసం చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అరటి కాయ ఫ్రై రెడీ.