Lotus Seeds Benefits । తామర గింజల్లో పోషకాలు పుష్కలం.. ఈ గింజలు రోజూ తింటే..
Lotus seeds benefits In Telugu : తామర గింజలను ‘మఖానా’ అని అంటారు. వీటిని ఇంగ్లీషులో Fox seeds అని కూడా పిలుస్తారు. ఈ గింజల్లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ క్యాలరీలు ఉన్న మఖానాను ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
వీటిలో ఉండే ప్రోటీన్ బరువు తగ్గించడంలో సహాయపడితే… ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. బరువును తగ్గించటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మఖానాలో ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. .
వీటిలో ఉండే మెగ్నీషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఈ గింజలు చాలా బాగా సహాయపడతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కర స్థాయిలను నియంతృస్తాయి. వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను దంతాలను బలంగా మారుస్తుంది.
దాంతో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. అలాగే వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్ గర్భధారణ సమయంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గర్భదరణ సమయంలో రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. వీటిలో సోడియం తక్కువ పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది.
అయితే మఖానాను ఎలా తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి… పచ్చిగా లేదా వేగించి లేదా ఉడకబెట్టి సూప్స్, సలాడ్స్, కూరల్లో వేసుకోవచ్చు. చాలామంది వీటిని డ్రై రోస్ట్ చేసి స్నాక్స్ గా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే వీటిని తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అలర్జీలు., గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.