Kitchenvantalu

Mysore Bonda:మైసూర్ బోండా ఇలా చేస్తే పిండి పిండిలా లేకుండా రౌండ్ గా హోటల్లో లాగా వస్తాయి

Mysore Bonda:మైసూర్ బోండా..మార్నింగ్ స్పెషల్ టిఫిన్స్ లోకి మైసూర్ బోండా యాడ్ చేసుకోండి.హోటల్ స్టైల్ లో లా రావాలంటే ఇలా ఫాలో అయిపోండి.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 1 కప్పు
పెరుగు – 1 కప్పు
బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – 1 టీ స్పూన్
బేకింగ్ సోడా – ¼ టీ స్పూన్
పచ్చిమిర్చి – 1 టీ స్పూన్
అల్లం తురుము – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి మైదా పిండి,బియ్యం పిండి ,ఉప్పు,బేకింగ్ సోడా ,జీలకర్ర,అల్లం,పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోవాలి.
2.ఇప్పుడు అందులోకి పెరుగు యాడ్ చేసి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోని చిక్కగా కలుపుకోవాలి.
3.కలుపుకున్న పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు చేతులను తడి చేసుకోని గుండ్రని బోండాలను నూనెలో వేసుకోవాలి.
5.స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోని బోండాలను తిప్పుతూ వేయించుకోవాలి.
6.అంతే వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ.