Beauty Tips

Mehndi Tips:చేతులపై మెహందీ త్వరగా పోవాలంటే….అద్భుతమైన చిట్కాలు

Mehndi Tips:మెహందీ పెట్టుకున్నప్పుడు బానే ఉంటుంది. రాను రాను అది వెలసిపోయినట్లు మరకల్లా కనిపిస్తుంది. ఇది చూడ్డానికి అంతగా బాగోదు. అంతా త్వరగా ఇది చేతుల నుంచి పోదు కూడా. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మెహందీ మరకలు త్వరగా పోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టూత్ ‌పేస్ట్‌లోనూ అద్భుత గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల చాలా వరకూ మరకలు పోతాయి. పేస్ట్‌లో మెహందీ రంగును తొలగించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మెహందీని పోగొట్టుకునేందుకు పేస్ట్‌ని తీసుకుని మెహందిపై పొరలా అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయండి. ఇలా చేస్తే ఆ మరకలు పోతాయి. కాబట్టిని పేస్ట్‌ని కూడా అప్లై చేసి మరకలను పోగొట్టుకోవచ్చు.

ఉప్పు కూడా మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల చాలా వరకూ మెహందీ మరకలు పోతాయి. ఇందు కోసం ఏం చేయాలంటే.. ఒక బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని అందులో ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటిలో చేతులు మునిగేలా ఉంచండి. 20 నిమిషాల తర్వాత బయటకి తీయండి.

ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ పోతుంది. కాళ్లకి ఉన్న మరకలు కూడా ఇలా చేయడం వల్ల పోతాయి. దీనికోసం ఓ టబ్‌లో ఉప్పునీటిని పోసి అందులో కాళ్లను పెట్టి ఆ తర్వాత రాయండి. ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ మరకలు పోతాయి.