Kitchenvantalu

Crispy Murukulu:బియ్యంపిండిలో ఈ పిండి కలిపి మురుకులు చేస్తే గుల్లగా కరకరలాడుతూ వస్తాయి

Murukulu:బియ్యం పిండి మురుకులు..పండగలకు చేసుకునే మురుకులు ఈజీగా క్రిస్పిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – ½ కప్పు
పెసర పప్పు – ½ కప్పు
బియ్యం పిండి – 4 కప్పులు
కారం – 2 టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
నువ్వులు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
వాము – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా కుక్కర్ లో మినపప్పు ,పెసర పప్పువేసి మూడు ,నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
2.ఉడికిన పప్పులను మెత్తగా చేసుకోవాలి.
3.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి బియ్యం పిండి ,ఉప్పు,కారం,నువ్వులు,జీలకర్ర,వాము,టేబుల్ స్పూన్ వేడి నూనె,మాష్ చేసుకున్న పప్పు ,కొద్దికొద్దిగా నీళ్లను వేసి పిండిని కలుపుకోవాలి.
4.ఇప్పుడు మురుకుల మిషన్ లో పిండిని ఉంచి కావాల్సిన ఆకారంలో ప్లేట్ పై గాని కవర్ పై గాని వత్తుకోవాలి.
5.వత్తుకున్న మురుకులను డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి.
6. మురుకులు కరకరలాడే వరకు వేపుకుని తీసుకుంటే మురుకులు రెడీ.