Kitchenvantalu

Apple Halwa:ఎప్పుడైన ఆపిల్ తో హల్వా చేసారా.. అదిరిపోయే రుచిగా ఉంటుంది

Apple Halwa:ఆపిల్ హల్వా.. రోజు ఒక యాపిల్ తింటే అన్ని అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు అంటారు. అలాంటి హెల్తీ ఫ్రూట్ ని తప్పకుండా మన  ఫుడ్ మెనులో యాడ్ చేసుకోవాలి. ఆపిల్ తో హల్వా చేసి చూడండి .చాలా టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
ఆపిల్స్ – 3
బొంబాయి రవ్వ – 1 కప్పు
చక్కెర – ¾ కప్పు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
డ్రై ఫ్రూట్స్ – ½ కప్పు
యాలకుల పొడి – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా ఆపిల్ తొక్క తీసి ముక్కలు గా చేసుకోని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ లో బొంబాయి రవ్వ,చక్కెర వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి ఆపిల్ పేస్ట్ వేసి కలుపుకోవాలి.
5.అందులోకి యాలకుల పొడి వేసి కలుపుతూ హల్వా దగ్గర పడే వ
రకు కలుపుతూ ఉడికించుకోవాలి.
6.చివరగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే.