MoviesTollywood news in telugu

Bigg Boss 7 Telugu Finale: బిగ్‍బాస్ ఫినాలేకు గెస్ట్‌గా స్టార్ హీరో..ఎవరో తెలుసా..?

Bigg Boss 7 Telugu Finale: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫినాలే కోసం టాలీవుడ్ బడా స్టార్ హీరో గెస్టుగా రానున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ప్రేక్షకులను బాగా అలరిస్తూ చివరి వారానికి చేరుకుంది.

బిగ్ బాస్ సీజన్ 7 కి నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే ని స్టార్ మా ఛానెల్ భారీగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం హౌస్‍లో ఫైనలిస్టులుగా ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంక ఉన్నారు.

డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలుస్తుంది. బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍ గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మెయిన్ గెస్ట్‌గా రానున్నారని వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తే టీఆర్‌పీ రేటింగ్స్ కూడా అడిరిపోతాయని స్టార్ మా భావిస్తోంది.

బిగ్‍బాస్‍లోనూ గుంటూరు కారం మూవీ ప్రమోషన్లను కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తారని తెలుస్తోంది. బిగ్‍బాస్ స్టేజీపైనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. తివిక్రం దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.