Kitchenvantalu

Egg Pizza:ఎగ్ తో ఒకసారి ఇలాగా ఎగ్ పిజ్జా చేసి మీ పిల్లలకి పెట్టండి.. రోజు ఇదే కావాలంటారు

Egg Pizza:ఎగ్ పిజ్జా.. ఈ రోజుల్లో పిల్లలు ,పెద్దలు ఫాస్ట్ ఫుడ్ నే ఎక్కువ ఇష్టపడ్తున్నారు. ఇడ్లీ,దోశ లకన్న పిజ్జా ,బర్గర్ అంటే తెగ తినేస్తున్నారు. ఎగ్ పిజ్జాని ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు పెట్టండి.పిజ్జా హట్ ఫీలింగ్ వస్తుంది.

కావాల్సిన పదార్ధాలు
గుడ్లు – 4
బ్రెడ్ ముక్కలు – 4
టమాటో – 1
ఉల్లిపాయ – 1
క్యాప్సికం – 1
కార్న్ – 2 టేబుల్ స్పూన్స్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
పిజ్జా సాస్ – 1 టేబుల్ స్పూన్
చీజ్ – 1 స్లైస్
చిల్లి ఫ్లెక్స్ – 1 సాచెట్

తయారీ విధానం
1.మిక్సింగ్ బౌల్ లోకి నాలుగు గుడ్లను కొట్టి,చిటికెడు ఉప్పు ,మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి.
2.బ్రెడ్ అంచులను కట్ చేసుకోని ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి.
3.ఇప్పుడు ట్యాంపరింగ్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడి చేసి ఉల్లిపాయలు,టమాటోలు,క్యాప్సికం ముక్కలను ఫ్రై చేసుకోవాలి.
4.కొద్దిగా రంగు మారిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు పిజ్జా బేస్ కోసం ఒక పాన్ లో బటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.

6.అందులోకి గుడ్డు,బ్రెడ్ ముక్కల మిశ్రమాన్ని వేసి ప్యాన్ లో స్ప్రెడ్ చేసుకోవాలి.
4.సిధ్దం చేసుకున్న బేస్ ని మూత పెట్టుకోని తక్కువ మంట పై కొద్దిగా ఉడికించుకోవాలి.
5.ఇప్పుడు ఉడికిన పిజ్జా బేస్ ని ప్లేట్ లోకి ఉల్టా తిప్పి పెట్టుకోవాలి
6.పిజ్జా బేస్ రెడీగా ఉంది. దాని పై పిజ్జా సాస్,లేదా టమాటో సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
7.అలాగే చీజ్ తురుము,వేపి పెట్టుకున్న కూరగాయ ముక్కలను ట్యాంపరింగ్ చేసుకోవాలి.
8.దాని పై ఒరిగానో ,చిల్లి ఫ్లెక్స్,వేసి మూత వేసి చీజ్ కరిగే వరకు రెండు,మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్ పిజ్జా రెడీ.