Hair Care Tips:ఈ డికాషన్ వాడితే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది
Fenugreek Seeds Hair Growth Tips: ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో మనలో చాలా మంది ఈ సమస్యలు ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. .
అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త ఓపికగా శ్రద్ధగా సమయాన్ని కేటాయిస్తే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు స్పూన్ల మెంతులను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ల రోజ్ మేరీ ఆకులను వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ ఆముదము., ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని బాగా కలిపితే ఒక వైట్ క్రీమ్ లా తయారవుతుంది. .
రోజ్ మేరీ, మెంతుల మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్టులో కాస్త నీటిని పోసి వడగట్టి జ్యూస్ ని సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ఆముదం మరియు అలోవెరా జెల్ క్రీమ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. .
ఆ తర్వాత ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మెంతులు మన జుట్టుకు ఒక సంజీవిని వంటిది అని చెప్పవచ్చు. జుట్టు రాలకుండా చుండ్రు లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి బాగా సహాయపడతాయి. రోజ్ మేరీ ఆకులు ఆన్లైన్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. ఇవి జుట్టు ఎదుగుదలలో బాగా సహకరిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.