MoviesTollywood news in telugu

Japan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన జపాన్ తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడాలంటే?

Japan OTT Streaming: తమిళ స్టార్ నటుడు కార్తీ నటించిన జపాన్ సినిమా తెలుగులోనూ వచ్చేసింది. రెండు రోజుల క్రితం కేవలం తమిళంలోనే స్ట్రీమింగ్ అయిన సినిమాను నెట్‌ఫ్లిక్స్ నిన్నటి నుంచి అంటే December 13 న తెలుగులోనూ తీసుకొచ్చింది.

రాజా మురుగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం వెర్షన్లు కూడా చూడొచ్చు. తమిళ స్టార్ నటుడు కార్తీ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు.

కార్తీ ఈ సినిమాను డిఫరెంట్ కంటెంట్‌తో చేసాడు. ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంలో విఫలం అయింది. జపాన్ పాత్రలో కార్తీ అదరగొట్టాడు. ఆ క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్క్రీన్ పై తెలుస్తుంది.

అయితే ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమాను చూస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ పరంగా అలరిస్తుంది.