Kitchenvantalu

Vankaya Biryani:కేవలం 30 నిమిషాల్లో రుచికరమైన గుత్తి వంకాయ ధమ్ బిర్యానీ

Vankaya Biryani:వంకాయ బిర్యాని.. వీకెండ్స్ లో రెగ్యులర్ పలావ్ కాకుండా, వంకాయతో బిర్యాని చేసి చూడండి. వెజిటేరియన్స్ తప్పకుండా ఇష్ట పడతారు.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 1/4kg
కారం – 2 టీ స్పూన్స్
బాస్మతి రైస్ – 2 కప్పులు
ఉప్పు – 2 టీ స్పూన్
పసుపు – 1/2టీస్పూన్
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 1/2టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 1/2టీస్పూన్
నిమ్మరసం – 2 టీ స్పూన్
పుదీనా – 1/2కప్పు
కొత్తిమీర – 1/2కప్పు
పెరుగు – 1/2కప్పు
యాలకులు – 4
లవంగాలు – 6
సాజీరా – 1/2టీ స్పూన్
దాల్చిన చెక్క – 3 ఇంచులు
బిర్యాని ఆకులు – 2
ఉల్లి పాయలు – 2

తయారీ విధానం
1.బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానపెట్టుకోవాలి.
2.శుభ్రం చేసుకున్న వంకాయలను నాలుగు ముక్కలుగా విడిపోకుండా కట్ చేసుకోవాలి.
3.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి, వంకాయ ముక్కలను, వేపుకోవాలి.
4.5 నుంచి 10 నిముషాల వరకు వంకాలయను వేయించి పక్కనపెట్టుకోవాలి.
5.ఇప్పుడు ఉల్లిపాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి.
6.ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు వేసి, మెత్తగా బీట్ చేసుకోవాలి. అందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పెస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, నిమ్మరసం , వేసి మిక్స్ చేసుకోవాలి.

7.కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉల్లిపాయలు, వన్ స్పూన్ ఆయిల్, వేపుకున్న వంకాయ ముక్కలు వేసి, 15 నుంచి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ప్యాన్ లో సగం వరకు నీళ్లను వేసి, 1 టీస్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె, హోల్ గరం మసాలా వేసి మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి.
8. మరిగిన ఎసరు లో నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70 శాతం ఉడకనివ్వాలి.
9.ఇప్పుడు వేరొక స్టవ్ పై, మందపాటి గిన్నెను తీసుకుని, అడుగున నెయ్యి రాసుకోవాలి. దానిపై, మ్యారినేట్ చేసిన వంకాయ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి.
10. కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని పై 70 శాతం ఉడికిన అన్నాన్ని జెల్లి గరిటె సాయం తో, నీటిని తీసేసి, వంకాయలపై స్ప్రెడ్ చేసుకోవాలి.

11. అన్నం పై డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లి పాయలు, కొత్తి మీర ఉల్లిపాయ ఆకులు, బటర్, చల్లుకుని, ఆవిరి పోకుండా, మూత వేసి, 5 నిముషాలు హై ఫ్లేమ్ పై , 5 నిముషాలు లో ఫ్లేమ్ పై , ఉడికించుకోవాలి.
12. బిర్యాని పాన్ ను, డైరెక్ట్ గా కాకుండా, స్టవ్ పై మరొక ప్యాన్ ను వేడి చేసి, దాని పై ఉడికించుకోవాలి.
13. 10 నిముషాలు ఉడికించిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిముషాల తర్వాత మూత తెరవాలి.
14. అంతే.. వేడి వేడి వంకాయ బిర్యాని రెడీ.