Kitchenvantalu

Kattu Charu:కూరగాయలు లేనప్పుడు.. ఈ కట్టు చారు మీ ఇంటి Special అవ్వడం ఖాయం

Kattu Charu:కట్టు చారు..తెలంగాణా స్పెషల్ గా చేసుకునే, సంప్రదాయ వంటకం ఉగాది కట్టు చారు.

కావాల్సిన పదార్ధాలు
కట్టు – తగినంత
ఉల్లిపాయ -1
వెల్లుల్లి రెబ్బలు – 5
పండిన మామిడి తురుము – కొద్దిగా
టమాటాలు – 2
పచ్చిమిర్చి -5
కొత్తిమీర – చిన్న కట్ట
కరివేపాకు – రెండు రెమ్మలు
చింతపండు – 15 గ్రాములు
మిర్యాల పొడి – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జిలకర్ర మెంతుల పొడి – ½ టీ స్పూన్
శనగపిండి బెల్లం మిశ్రమం – 2 టేబుల్ స్పూన్స్
తాళింపు గింజలు – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.కందిపప్పు ఉడకపెట్టిన తర్వాత,నీళ్లను కట్టుకోసం పక్కనపెట్టుకోవాలి.
2.ఇప్పుడు ఒక గిన్నెలోకి , కట్టు నీళ్లను తీసుకుని, చింతపండు రసం వేసి కావాల్సినన్ని నీళ్లతో చారు సిద్దం చేసుకోవాలి.
3.అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, మామిడి కాయ తురుము, కరివేపాకు, కొత్తిమీర తరుగు, టమాటో ముక్కలు, వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
4. రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, శనగపిండి , బెల్లం వేసి, 15 నముషాల పాటు మరిగించాలి.

5. వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, నీళ్లను వేసి కలిపి, ముద్దలు లేకుండా, కట్టులో కలుపుకోవాలి.
6. మరొ 5 నిముషాలు కట్టు మిరిగించిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7. ఇప్పుడు తాళింపు కోసం, వేరొక పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి,
వేపుకుని, మరుగుతున్న కట్టు చారులో వేసుకోవాలి.
8. అంతే.. ఉగాది స్పెషల్ కట్టు చారు రెడీ అయిపోయినట్లే..