Beauty Tips

Face Glow Tips:రాత్రి పడుకొనే ముందు ఆవనూనె ముఖానికి రాస్తే ఏమి అవుతుందో తెలుసా?

Mustard Oil Skin Benefits In telugu : ఆవనూనెను ముఖానికి రాయటం వలన ముఖంపై చర్మం బిగుతుగా మారడమే కాకుండా ముఖంపై ఉన్న మృత చర్మ కణాలు తొలగిపోతాయి. మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. దానికోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. .

అయితే అందులో ఉండే రసాయనాల కారణంగా చర్మానికి నష్టం కలిగే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలోనే చర్మం తెల్లగా మెరవడానికి ఒక నూనెను ఉపయోగించవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి చర్మం సహజసిద్ధంగా తేమగా ఉండటానికి ఆవ నూనె చాలా బాగా సహాయ పడుతుంది.

ఆవనూనెను ముఖం మీద రాసి మసాజ్ చేస్తే చర్మం తేమగా ఉండటమే కాకుండా చర్మ సమస్యలు నయమవుతాయి. అంతేకాకుండా అవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మంపై హానికరమైన బాక్టీరియాని తొలగించి మొటిమలు వంటివి రాకుండా సహాయపడుతుంది. .

ఆవనూనె ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో తేమను లాక్ చేసి పోషణ అందించడంలో సహాయపడి చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ఆవనూనెను చర్మానికి రాసి మసాజ్ చేయడం వలన టానింగ్, పిగ్మెంటేషన్, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఇది చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేసి చర్మాన్ని లోతుగా శుభ్రపరచి ముఖంపై మృత చర్మ కణాలను శుభ్రపరచడంలో సహాయ పడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖంపై ఉండే సన్నని గీతలు, ముడతలు మరియు రంధ్రాలను తగ్గించి మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.