Kitchenvantalu

Ullipaya Bondalu: ఉల్లిపాయ‌ బొండాల‌ని కేవలం 10 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చాలా బాగుంటాయి..!

Ullipaya Bondalu : మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్ నూన్ లంచ్, నైట్ డిన్నర్ , ఎంత ముఖ్యమో , ఈవినింగ్ స్నాక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సాయంత్రం అవుతుంది అంటే చాలు టీ విత్ స్నాక్స్ వైపు మనసు లాగేస్తుంటుంది. వారి కోసమే ఇన్ స్టెంట్ గా ఇంట్లో ఉండే పదార్థాలతో ఉల్లి బోండాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు – 3 ( సన్నగా తరుగుకోండి)
బియ్యం పిండి – 1/4 కప్పు
మైదా పిండి – 1 కప్పు
బంగాళదుంప – 1
పెరుగు – 1/2 కప్పు
పచ్చిమిర్చి – 2 ( సన్నగా తరిగినవి)
అల్లం – ఒక టీ స్పూన్
వంట సోడా – 1/4 టీ స్పూన్
ఉప్పు – తగినంత
కరివేపాకు – ఒక రెమ్మ

తయారి విధానం
1.ముందుగా బంగాళదుంపను మిక్సీ లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, బంగాళదుంప పేస్ట్ , బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, వేసి కలుపుకోవాలి.

2.కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ , పిండిని కాస్త జారుగా తయారు చేసుకోవాలి.

3.ఇప్పుడు అందులో వంట సోడా, అల్లం పెస్ట్, పచ్చిమిర్చి తురుము, తరిగిన ఉల్లిపాయలు వేసి కలపాలి.

4.స్టవ్ పై బాండీ పెట్టుకుని నూనేను వేడిచేసుకోవాలి.

5.నూనె వెడెక్కిన తర్వాత తయారు చేసుకున్న పిండిని బోండాలుగా నూనెలో వేసుకోవాలి.

6.సన్నని మంటపై బొండా లోపల కూడా ఉడికేలా ఎర్రగా వేయించుకోవాలి.

7.అంతే … కరకరలాడే ఉల్లిబోండా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News