Kitchenvantalu

Bitter Gourd Chips:కాకరకాయ చిప్స్ కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే …

Bitter Gourd Chips:కాకరకాయ చిప్స్..పప్పు,చారు ,గ్రేవి కర్రీస్ చేసుకున్నప్పుడు పక్కన ఏదో ఫ్రై కర్రీస్ కాని,చిప్స్ కాని తినాలనిపిస్తుంది.కాకరకాయ వడియాలు చేసి చూడండి సూపర్ కాంబినేషన్ అంటారు.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
కరివేపాకు – ½ కప్పు
ఉప్పు – 1 టీస్పూన్
కారం – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను గుండ్రని బిల్లలుగా కట్ చేసుకోవాలి.
2. ఒక గిన్నెలోకి ఉప్పు వేసి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి నీళ్లలో అరగంట పాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి కార్న్ ఫ్లోర్ ,బియ్యం పిండి,పసుపు,కారం,అల్లం వెల్లుల్లి పేస్ట్,జీలకర్ర పొడి ,నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
4.కొద్దిగా నీళ్లను యాడ్ చేసి పిండిని కలుపుకోవాలి.
5.ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.

6.కలర్ కోసం కొద్దిగ ఫుడ్ కలర్,కరివేపాకు వేసి పదినిమిషాలు నానబెట్టుకోవాలి.
7.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసి కొద్ది కొద్దిగా కాకరకాయ ముక్కలను వేసి వేపుకోవాలి.
8.ముక్కలను ఎర్రగా కరకర లాడేలా వేపుకుంటే కాకరకాయ చిప్స్ రెడీ.
9.చల్లారక ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకోవాలి.