MoviesTollywood news in telugu

Nani ‘జెర్సీ’ సినిమాను మిస్ చేసుకున్న భామ ఎవరో తెలుసా?

Nani jersey Movie : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతుంది.ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే సినిమాలతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి హిట్ కొట్టింది.

అయితే ఈ బ్యూటీ తాను వదులుకున్న ఓ సినిమాను గుర్తుకు చేసుకుని ఫీలవుతుందట. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు జనం నీరాజనం పట్టారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ ఎమోషన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత రష్మిక మందన్నను సంప్రదించారట చిత్ర యూనిట్.

కానీ ఈ తనకు సౌత్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ కారణంగా డేట్ అడ్జెస్ట్‌మెంట్స్ విషయంలో ఇబ్బంది ఉంటుందని ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. అయితే ఇప్పుడు ఆ సినిమాలో నటిస్తే బాగుండేది అని ఆమె ఫీల్ అవుతోందట.