Kitchenvantalu

Ragi Roti:రాగి రొట్టెలు మెత్తగా మంచి రుచిగా రావాలంటే ఇలా చేసి తీరాల్సిందే

Ragi Roti:రాగి రోటీ..ఎంతో ఆరోగ్య కరమైనా రాగులతో ఎన్నో రెసిపీస్ చేస్తుంటాం. ఈసారీ రాగి రోటి ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
రాగి పిండి – 2 కప్పులు
ఉప్పు – చిటికెడు
నూనె – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి రాగిపిండిని వేసి కప్పు నీళ్లతో కలుపుకోవాలి.
2.చిటికెడు ఉప్పు,1/2 టీ స్పూన్ నూనే వేసి పిండిని మరిగించుకోవాలి.
3.ఉడకడం స్టార్ట్ అయ్యాక కలుపుకోని మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4.దగ్గర పడ్డ పిండిని మూడు,నాలుగు నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా తీసుకోని గుండ్రని బంతుల్లా తయారు చేసుకోవాలి.

5.దీని రొట్టల కర్ర పై పొడి పిండిని చల్లూతూ రొట్టెలను తాల్చుకోవాలి.
6.ప్యాన్ వేడి చేసి తయారు చేసుకున్న రోటీలను వేసి వేపుకోవాలి.
7.పొంగుతున్నప్పుడు కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
8.అంతే ఆరోగ్య కరమైనా రాగి పిండి రోటీ రెడీ.