MoviesTollywood news in telugu

Jagapati Babu భార్య లక్ష్మి ఎవరి కూతురో తెలుసా…నమ్మలేని నిజాలు

Jagapati Babu Wife: తెలుగు సినీ పరిశ్రమలో మహిళా అభిమానులను సంపాదించుకున్న హీరో జగపతి బాబు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు,శోభన్ బాబులకు మాత్రమే మహిళా అభిమానులు ఉండేవారు. ఆ తర్వాత మహిళా అభిమానుల్లో అంతటి క్రేజ్ సంపాదించింది జగపతి బాబు ఒక్కడే.

ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈ విలక్షణ నటుడు కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత సినిమాలు హిట్స్ కొడుతూ కెరీర్ పీక్ స్టేజి కి చేరాడు. అయితే కొన్ని కారణాలతో కెరీర్ పరంగాను,ఆర్ధికంగానూ వెనకపడ్డాడు. ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ కొడుకుగా జగపతిబాబు మీద అందరూ జాలి పడ్డారు కానీ ఎవరు ఆదుకోలేదు.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతి బాబు లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి అందరిని మెప్పించి నటుడిగా మరల ఫాం లోకి వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి తండ్రి పాత్రలు, మోడరన్ విలన్ పాత్రలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. జగపతి బాబు తన జీవితంలో ఎంతో స్టార్ డమ్ ని చవి చూసాడు. అదే సమయంలో తీవ్రమైన నిరాదరణ ఎదుర్కొన్నాడు.

ఇండస్ట్రీలో ఎవరు హీరోగా ఛాన్స్ ఇవ్వని రోజుల్లో కూడా చాలా నిబ్బరంగా ఉన్నాడు. జగపతి బాబు ఇంత నిబ్బరంగా ఉండటానికి అతని కుటుంబమే కారణమని చెప్పాలి. ముఖ్యంగా జగపతి బాబు భార్య లక్ష్మి ఆయనకు అడుగు అడుగున దైర్యం చెప్పుతూ ఉండేది. హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు జగపతి బాబు మీద కొన్ని ఎఫైర్స్ ఇబ్బంది పెట్టాయి. ఆ సమయంలో కూడా లక్ష్మి కృంగిపోకుండా నిబ్బరంగా ఉంది. అలా అని తన భర్తను కూడా ఏమి అనలేదు.

మీరు ఎలా తిరిగిన ఇంటి దగ్గర భార్య ఉందని మర్చిపోవద్దని చెప్పిందట జపతి బాబు భార్య లక్ష్మి. ఇప్పటికి ఆ మాటను తలచుకొని జగపతి బాబు ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అసలు జగపతి బాబు,లక్ష్మికి పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగపతి బాబు వంటి యాంగ్రీ యంగ్ మెన్ ని లక్ష్మి ప్రేమలో పాడేయటం ఒక వండర్ అని చెప్పాలి. జగపతి బాబు డిగ్రీ అయ్యాక వైజాగ్ లో ఉన్న తమ ఫర్నిచర్ ఫ్యాక్టరీని చూసుకోవటానికి వచ్చాడు.

అక్కడే లక్ష్మితో పరిచయం ఏర్పడి కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. లక్ష్మి జగపతి బాబుకి బంధువు అవుతుంది. అయినా లక్ష్మి ఇంటిలో జగపతి బాబు మీద మంచి అభిప్రాయం లేకపోవటంతో వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు. ప్రతి రోజు వీరి పెళ్లి గురించి చర్చ ఇద్దరి ఇళ్లలోనూ వచ్చేది. ఒకరోజు జగపతి బాబు ఫ్యాక్టరీ పిట్ట గోడపై పడుకొని పాటలు వింటూ ఉంటే పడిపోయాడట. దెబ్బలు బాగా తగలటంతో ఆసుపత్రిలో జాయిన్ చేసారు.

ఈ సంఘటనను జగపతి బాబు తండ్రి మరోలా అర్ధం చేసుకున్నారు. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో జగపతి బాబు ఆత్మహత్య ప్రయత్నం చేసాడని భావించి అప్పటికప్పుడే పెళ్ళికి ముహార్తాలు పెట్టించి పెళ్లి జరిపించారు. వీరికి మేఘన,లేఖ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అమ్మాయి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయింది. ఇక రెండో అమ్మాయి చదువుకుంటుంది.