NTR ‘జై లవకుశ’ మొదట ఏ స్టార్ హీరో దగ్గరకు వెళ్లిందో…. ?
Ntr Jai Lava Kusa Movie : టాలీవుడ్ లో తమ అభిమాన నటుని గురించి వచ్చే విషయాలను తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడు సిద్దంగా ఉంటారు. సినిమా ప్రపంచంలో సినిమాలు ఒక హీరో నుంచి మరో హీరో దగ్గరకు వెళుతూ ఉంటాయి. ఆ సినిమాలు హిట్ కావచ్చు. లేదా ఫట్ కావచ్చు. దర్శకుడు ఒక కథను తీసుకోని ఒక హీరో దగ్గరకు వెళ్ళితే ఆ హీరో కొన్ని మార్పులను చేయమంటారు.
ఆ దర్శకుడికి ఆ మార్పులు నచ్చితే సినిమా కంటిన్యూ అవుతుంది. ఆ మార్పులు నచ్చకపోతే ఆ దర్శకుడు వేరే హీరో దగ్గరకు వెళతాడు. అలానే ఒక సినిమా రవితేజ నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. ఆ సినిమానే ‘జై లవకుశ’.ఈ సినిమాను బాబీ మొదట రవితేజకు వినిపించాడు. మూడు క్యారెక్టర్స్ ఉండటంతో చాలా ఆసక్తిగా విన్నాడు.
జై పాత్ర మినహా రెండు పాత్రలను చేయటం తేలికే అని…జై పాత్ర పొటెన్షియాలిటీని తగ్గించి మిగిలిన రెండు పాత్రల ప్రాధాన్యతను పెంచమని కోరాడు రవితేజ. ఆ మార్పులకు అంగీకరించలేని బాబీ ఆ కథను ఎన్టీఆర్ కి వినిపించటం ఎన్టీఆర్ ఒకే చేయటం చక చక జరిగిపోయాయి. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఎన్టీఆర్ ఈ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపాడు.