Aloo Gobi Masala Curry:క్యాటరింగ్ స్టైల్ లో ఆలూ గోబీ మసాలా గ్రేవీ సూపర్ ఉంటుంది …
Aloo Gobi MAsala Curry:ఆలు గోబీ మసాలా కర్రీ..గ్రేవీ కర్రీస్ కోసం ఆలు గోబీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది.బగారా రైస్,చపాతి,రోటిలోకి కూడ కరెక్ట్ గా సూట్ అవుతుంది.ఆలు,గోబీ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంపలు – 2 కప్పులు
కాలీ ఫ్లవర్ – 2 కప్పులు
టొమాటో పేస్ట్ – 3
పచ్చిమిర్చి – 2
మిరియాల పొడి – 1 ½ టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి తరిగిన బంగాళదుంపలు వేసి వేపుకోవాలి.
2.మూత పెట్టుకోని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
3.అందులోకి రెండు కప్పుల తరిగిన కాలిఫ్లవర్ ముక్కలు కూడ వేసి వేపుకోవాలి.
4.వేపుకున్న కూరగాయలను ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
5.అదే ప్యాన్ మరికాస్తా ఆయిల్ వేసుకోని ఉల్లిపాయ తరుగువేసి వేపుకోవాలి.
6.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,పచ్చిమిర్చి,టమాటో పేస్ట్ వేసి మూత పెట్టుకోని నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.
7.టమాటా మగ్గాక అందులోకి కారం,ధనియాలపొడి,ఉప్పు,జీలకర్ర పొడి,కప్పు నీళ్లను వేసి కలిపి ఉడికించాలి.
8.గ్రేవి ఉడకడం మొదలు పెట్టాక అందులోకి వేపుకోని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు,కాలీఫ్లవర్ ముక్కలు వేసి గ్రేవి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి.
9.చివరగా గరంమసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు ,గోబి మసాలా కర్రీ రెడీ.