Healthhealth tips in telugu

Cloves Benefits:పరగడుపున 2 లవంగాలను ఇలా తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…

Cloves Health benefits In Telugu : లవంగాలను మసాలా దినుసులలో రారాజు గా పిలుస్తారు. మసాలా వంటలకు లవంగాలను వాడుతూ ఉంటాం. అయితే మనలో చాలామందికి లవంగాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
.Diabetes tips in telugu
లవంగాలలో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. లవంగాల నీటిని తీసుకోవచ్చు లేదా రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లవంగాలను వేయించి పొడి చేసుకొని నిలువ చేసుకోవాలి.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పొడి కలిపి ఉదయం పరగడుపున తాగాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమలాలి. అలా కాకుంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. లవంగాలను ఎలా తీసుకున్నా సరే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.
gas troble home remedies
అయితే ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో లవంగం తీసుకోవటం వలన జీర్ణక్రియను మెరుగు పరచుటమే కాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి సహాయపడుతుంది. చలికాలంలో జీర్ణ సంబంద సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
Diabetes diet in telugu
జీవక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దంత సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు ఉన్నప్పుడూ పంటి కింద లవంగం మొగ్గను పెట్టుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.