Kitchenvantalu

Kakarakaya karam:కాకరకాయల కారం చేదు లేకుండా రావాలంటే ఇలా ట్రై చేయండి

Kakarakaya karam:.కాకరకాయ కారం.. ఈ కాలంలో ఘాటు ఘాటుగా కాకరకాయ వేపుడు తింటే జలుబు ,దగ్గునుంచి కాస్త రిలీఫ్ అందుతుంది.స్పైసీ స్పైసీ కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
కారం – 3 టీ స్పూన్స్
ఉప్పు – 3 టీ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు – 2
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
నూనె – తగినంత

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి అవసరం అనుకుంటే పొట్టు తీసుకోవచ్చు.
2.చివర్లు కట్ చేసి నిలువుగా కోత పెట్టుకోని గింజలను తొలగించి చిటికెడు ఉప్పుతో లోపలి భాగాన్ని రుద్దుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి కాకరకాయలను లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి.
4.ఇప్పుడు మసాలా కోసం మిక్సి జార్ లోకి కారం ,ధనియాలు,జీలకర్ర ,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
5.ఇప్పుడు ఫ్రై అవుతున్న కాకరకాయలు బ్రౌన్ కలర్ లోకి మారాకా మిగిలిన నూనె తొలగించి తయారు చేసుకున్న మసాలాను కాకరకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి.
6.పది నిమిషాల పాటు మసాలా కాకరకాయలకు పట్టేలా వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నషాలానికంటే మసాల కాకరకాయ కారం రెడీ.