Movies

Mahesh Babu:104 డిగ్రీల జ్వరంతో మహేష్ బాబు చేసిన ఈ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా ?

Mahesh babu Murari Movie:రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు,సోనాలి బింద్రే హీరో,హీరోయిన్స్ గా నటించిన ‘మురారి’ సినిమాను నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ సమ్యుక్తంగా నిర్మించారు.ఈ సినిమా ద్వారానే సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

మురారి సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు అయ్యింది. పీటర్ హెయిన్ ఈ సినిమా ద్వారా ఫైట్ మాస్టరుగా తెలుగు సినిమాకి పరిచయమయ్యారు. ఈ సందర్భంగా మురారి సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం.

గోదావరి ఒడ్డున ‘ డుం డుం డుం నటరాజు ఆడాలి ‘ పాట, వాటర్ ఫైట్ చేసే సమయంలో మహేష్ బాబుకి 104 డిగ్రీల జ్వరం. అయినా సరే షెడ్యూల్ ప్రకారం నటించేసాడు. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది.

కొవ్వూరులోని గోదావరి ఒడ్డున తీసిన డుం డుం డుం నటరాజు ‘ పాట కోసం అకేలా క్రేన్ వాడారు. ఈ క్రేన్ తెలుగులో మొదటిసారిగా చూడాలని ఉంది సినిమాకు వాడారు. ఆ తర్వాత మురారి సినిమాకు వాడారు.

తెలుగులో డిజిటల్ ఎడిటింగ్ చేసిన మొదటి చిత్రం ‘మృగరాజు’. తెలుగు లో డిజిటల్ ఎడిటింగ్ చేసిన రెండో సినిమా ‘మురారి’కావడం విశేషం.

హస్యనటుడు చిత్తజల్లు లక్ష్మిపతికి ‘మురారి’ మొదటి సినిమా. ఈ సినిమా లక్ష్మీపతికి మంచి పేరు తీసుకురావటమే కాకుండా వరుస అవకాశాలను ఇప్పించింది.

క్లైమాక్స్ లో కీలకపాత్ర కోసం సీనియర్ నటుడు అయితే బాగుంటుందని భావించి కృష్ణ వంశీ ధూళిపాళను ఒప్పించి నటింపజేశారు. ‘దానవీరశూరకర్ణ’ లో శకునిగా చేసిన ధూళిపాళ రిటైరైపోయి సినిమాలకు దూరంగా గుంటూరుకు సమీపంలో ఉంటున్నారు.

కృష్ణ వంశీ తన సినిమాల్లో ఎక్కువగా సీతారామ శాస్త్రితో రాయించుకుంటారు. అయితే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం వేటూరితో రాయిద్దామని అడిగితే అయన పల్లవి మాత్రమే రాసి మరల కనపడలేదు. ఒక్కసారి కృష వంశీ కి వేటూరి గారు మణిశర్మ రికార్డింగ్ స్టూడియో లో కనపడితే ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వేటూరిగారు చెప్పుతూ ఉంటే కృష్ణ వంశీ రాసుకున్నారట.

తమిళంలో ఈ సినిమాను ఇదే టైటిల్ తో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కలిసి డబ్ చేయగా అక్కడ కూడా విజయవంతం అయింది.

కృష్ణ వంశీ తూర్పుగోదావరి జిల్లా పంపిణీ హక్కుల్ని తీసుకోని సుమారుగా 40 లక్షల రూపాయిల లాభాన్ని కళ్ళ చూసారు.

రఘబాబు లో విలనిజాన్ని , రవిబాబు కామిక్ టైమింగ్ ని ఈ సినిమాలో బాగా ఎలివేట్ అవ్వటంతో వారికీ ఈ సినిమా లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

ఎర్రపాటల బ్రాండ్ ఉన్న సుద్దాల అశోక్ తేజ తో ఒక పాటను రాయించి ఆ బ్రాండ్ పోయేలా చేసారు.

ఈ సినిమాకి శోభన్, నందినీ రెడ్డి, శ్రీవాస్, కుమార్ నాగేంద్రలు అసిస్టెంట్స్ గా పనిచేసి ప్రస్తుతం దర్శకులిగా సక్సెస్ సినిమాలు తీస్తున్నారు.

అమితాబ్ బచ్చన్, జయబాధురి ‘ మురారి ‘ చూసి కృష్ణవంశీ ని హిందీలో అభిషేక్ బచ్చన్ తో తీయమని అడిగారు. కానీ కృష్ణ వంశీకి కుదరలేదు.