White Hair:తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ పేస్ట్ తో 7 రోజుల్లో తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం!
White Hair Turn Black:తెల్లజుట్టు సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాలను పొందవచ్చు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు సమస్యలకు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్నవయసులోనే వచ్చేస్తుంది. అలా చిన్న వయసులో రావడం వల్ల చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ప్లాస్టిక్ లేదా చెక్క లేదా స్టీల్ గిన్నెలో ఒక స్పూన్ హెన్నా పొడి, అర స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ బ్రహ్మీ పొడి,ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ పుదీనా పొడి, ఒక స్పూన్ వెనిగర్, సరిపడా నీటిని పోసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసే కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత సాధారణమైన నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు కుంకుడు కాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి పలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.