Kitchenvantalu

Pepper Egg Fry:కోడి గుడ్డు మిరియాల వేపుడు ఒక సారి ఇలా చేసి రుచి చూడండి

Pepper Egg Fry:పెప్పర్ ఎగ్ Fry..పిల్లల లంచ్ బాక్స్ లోకి బాయిల్డ్ ఎగ్ తో పెప్పర్ ఎగ్ ప్రిపేర్ చేయండి.

కావాల్సిన పదార్దాలు
గుడ్లు – 3
ఉల్లిపాయలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
పెప్పర్ పౌడర్ – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి– ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు
పసుపు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా గుడ్లను ఉడికించుకోని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి ,కరివేపాకు,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.

4.అందులోకి ధనియాల పొడి,జీలకర్ర పొడి ,మిరియాల పొడి,ఉప్పు,గరంమసాలా వేసి కలుపుకోవాలి.
5.ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను వేసి మూతవేసి మూడు ,నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
6.నెమ్మదిగా గుడ్డు ముక్కలను రెండో వైపు తిప్పి మరో రెండు నిమిషాలు వేపుకోవాలి.
7.ఇప్పుడు కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే పెప్పర్ ఎగ్ కర్రీ రెడీ.