Kitchenvantalu

Phool Makhana Curry:ఎన్నో పోషకాలున్న తామర గింజలతో కేటరింగ్ స్టైల్ గ్రేవీ కర్రీ

Phool Makhana Curry:ఫూల్ మఖనా కర్రీ..ఒంటికి చలువ చేసే ఫూల్ మఖనా కర్రీ రేర్ గా చేసుకుంటు ఉంటారు.ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లో దొర్కుతుంటాయి. జీడిపప్పులు వేసి పూల్ మఖనా గ్రేవీ కర్రీ చేసారంటే రోటీ,చపాతి,రైస్ లోకి సూపర్ కాంబినేషన్ అవుతుంది.

కావాల్సిన పదార్ధాలు
ఫూల్ మఖనా – 1 కప్పు
ఉల్లిపాయలు – ½ కప్పు
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయ పేస్ట్ – ½ కప్పు
కారం – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఉప్ఉ – 1 ½ టీ స్పూన్
జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి మఖనా,జీడిపప్పులను వేపి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు అదే ప్యాన్ లోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకోని ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి.
3.ఉల్లిపాయలు కాస్త వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.

4.ఐదునిమిషాలు ఉడికించాక అందులోకి టమాటో పేస్ట్ వేసి కలుపుకోని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
5.ఇప్పుడు పసుపు,కారం ,అల్లంవెల్లుల్లి పేస్ట్,ధనియాల పొడి ,ఉప్పు వేసి కలుపుకోవాలి.
6.కారం వేగాక ఒకటిన్నర కప్పు నీళ్లను వేసి పచ్చిమిర్చి ముక్కలు ,వేపి పెట్టుకున్న లోటస్ విత్తనాలు వేసి ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి జీడిపప్పు లను వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
8.చివరగా గరం మాసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూల్ మఖనా కర్రీ రెడీ.