Beauty TipsHealth

Face Glow Tips:పాలల్లో వీటిని కలిపి రాస్తే బ్యూటీ పార్లర్ కి వెళ్ళి వేల కొద్ది ఖర్చు పెట్టిన రాని Glow వస్తుంది

Milk and rice flour Face Glow Tips : వేసవికాలం ఎండ కారణంగా, చెమట కారణంగా ముఖం నల్లగా మారటం,కందిపోవటం, మొటిమలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో ముఖం మిల మిల మెరిసిపోతుంది. దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి,అరస్పూన్ శనగపిండి,ఒక స్పూన్ ఆలోవెరా జెల్,రెండు స్పూన్ల పాలను వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక నీటిని జల్లుతు ముఖాన్ని రబ్ చేస్తూ కడగాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృత కణాలు అన్నీ తొలగిపోయి ముఖం మెరుస్తుంది.

శనగపిండి ముఖం మీద మురికిని తొలగించటమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. బియ్యం పిండి చర్మాన్ని శుభ్రం చేసి మొటిమలకు కారణం అయిన నూనెను తొలగిస్తుంది. ఈ చిట్కా ముఖం మీద మురికి,మచ్చలు, మొటిమలు ఇలా అన్నింటిని తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.