Tollywood Hero:పది రూపాయలు పారితోషికం తీసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Tollywood Hero Ravi Teja Movies :ఒక స్టార్ హీరో పది రూపాయల పారితోషకం తీసుకున్నాడు అంటే మీకు నమ్మలేని అనిపించట్లేదు కదా. ఇది నిజం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ స్టార్ హీరో కాకముందు పది రూపాయల పారితోషికం తో ప్రారంభించాడు. అతను ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ.
రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కామెడీ తో పాటు చాలా ఎనర్జిటిక్ గా నటిస్తూ ఉంటాడు. మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకోక ముందు ఎన్నో కష్టాలు అనుభవించాడు. 1968లో పుట్టిన రవితేజ దాదాపుగా తన కెరీర్ లో సెటిల్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది
1988లో హీరో అవ్వాలని చెన్నై వెళ్ళాడు. చెన్నైలో గుణశేఖర్ రూమ్ లో ఉండేవాడు. ఇంటిదగ్గర నుండి తెచ్చుకున్న డబ్బు అయిపోవడంతో ఖర్చుల కోసం జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకి పది రూపాయలకు పని చేసేవాడు.
ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పది రూపాయలు స్థాయి నుంచి కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ కష్టాలకు తట్టుకుని నిలబడితేనె అద్భుతమైన జీవితాన్ని గడపొచ్చు.