Chocolate Cupcakes:బేకరీ స్టైల్ కప్ కేక్స్ ఇలా ఇంట్లోనే కుక్కర్ లో చేసుకోవచ్చు
Chocolate Cupcakes:చాకలేట్ కప్ కేక్స్..పిల్లలు బేకరి ఐటమ్స్ వైపు చూడకుండా ఇంట్లో ఎన్నో రకాల వెరైటీస్ చేసెయ్యొచ్చు. ఎక్కువగా ఇష్టపడే కప్ కేక్స్ చేసి స్నాక్స్ కోసం ఇవ్వండి.ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్ లో కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మైదా- 1 కప్పు
చక్కెర – ¾ కప్పు
కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్స్
పాలు – ½ కప్పు
నూనె – ½ కప్పు
గుడ్లు – 3
వెనిలా ఎసెన్స్ – ½ టీ స్పూన్
బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
బేకిండ్ సోడా – ½ టీ స్పూన్
ఉప్పు – చిటికెడు
చోకో చిప్స్ – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా ప్రెజర్ కుక్కర్ అడుగున కప్పు ఉప్పు,లేదా ఇసుక వేసి పది ,పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై వేడిచేయాలి.
2.ఈ లోపు మిక్సింగ్ బౌల్ లోకి మైదా ,బేకింగ్ సోడా,బేకింగ్ పౌడర్ ,కోకో పౌడర్ కలుపుకోవాలి.
3.వేరొక గిన్నెలో గుడ్లను పగుల కొట్టి సొనను బాగా బీట్ చేసుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి చక్కెర,చిటికెడు ఉప్పు,నూనె ,వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
5.ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని వేసి మిక్స్ చేసుకోవాలి.
6.పిండి కాస్త చిక్కపడ్దాక పాలు యాడ్ చేసుకోవాలి.
7.తయారు చేసుకున్న మిశ్రమాన్ని కేక్ అచ్చులలో పోసుకోని టాప్ లో డ్రై ఫ్రూట్స్ తో అలంకరించుకోవచ్చు.
8.ఈ లోపు వేడెక్కిన కుక్కర్ ఇసుక పై ప్లేట్ ని పెట్టుకోని సిధ్దం చేసుకున్న కేక్ కప్పులను ప్లేట్ పై అమర్చుకోవాలి.
9.కుక్కర్ మూతకి వాచర్ తీసేసి మూతను పెట్టుకోవాలి.
10.హై ఫ్లేమ్ పై మూడు నిమిషాలు,మీడియం ఫ్లేమ పై పదినుంచి పదిహేను నిమిషాలు బేక్ చేసుకోవాలి.
11.కేక్ బేక్ అయ్యిందా లేదా టూత్ పిక్ సాయంతో చెక్ చేసుకోవాలి.
12.స్టవ్ ఆఫ్ చేసుకోని కప్ కేక్ లను తీసి ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి.
13.అంతే కప్ కేక్స్ రెడీ.