Kitchenvantalu

Store Garlic Paste:అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 నెలల పాటు నిల్వ ఉండాలంటే..ఇలా చేస్తే సరి

Ginger Garlic Paste: అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ప్రతి సారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే కష్టంగానూ,విసుగుగాను ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకుంటే సులువుగా ఉంటుంది. అయితే ఎక్కువగా చేసినప్పుడు నిల్వ ఎక్కువ రోజులు లేకుండా వారం రోజుల్లోనే పాడవుతుంది.

అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే…ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. 150 గ్రాముల అల్లం తీసుకోని శుభ్రం కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 250 గ్రాముల వెల్లుల్లిని తీసుకోని తొక్క తీసి ఉంచుకోవాలి.

మిక్సీ జార్ లో అల్లం ముక్కలు, తొక్కలు తీసిన వెల్లుల్లి రెబ్బలు,మూడు స్పూన్ల నూనె.సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఉప్పు,నూనె వెల్లుల్లి అల్లం పేస్ట్ తాజాగా ఉండటానికి సహాయపడతాయి. ఈ పేస్ట్ ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు.

గాలి చొరబడని గాజు బాటిల్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే 5 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రీజర్లో పెడితే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News