చక్కని నిద్ర సొంతం కావాలంటే…ఈ ఆహారాలు తప్పనిసరి
Good Sleep : రాత్రి సమయంలో మంచి నిద్ర పడితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే శారీరకంగా, మానసికంగా కూడా ఫిట్ గా ఉంటాం. నిద్ర సరిగా లేకపోతె అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ బిజీ జీవన శైలిలో ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. నిద్ర సరిగా లేకపోవటం వలన సరిగా ఆహారం తీసుకోకపోవడం, పని మీద దృష్టి పెట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కంటి నిండా నిద్ర ఉంటే చాలా వరకు సమస్యలు దూరం అవుతాయి. మనం తీసుకునే ఆహారం కూడా మంచి నిద్ర పట్టడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు చెపుతున్న ఆహారాలను తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
గ్రీన్ టీ, బ్లాక్ టీ
కొన్ని రకాల అమైనో ఆమ్లాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి నిద్ర పట్టడానికి దోహదం చేస్తాయి. ఎల్-థియనైన్ అని పిలిచే రిలాక్సేషన్ అమినో యాసిడ్ యాంగ్జయిటీని తగ్గించి నిద్ర పట్టడానికి ఉపకరిస్తుంది. ఇది గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీలలో అధికంగా లభిస్తుంది.
దాల్చిన చెక్క
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా నిద్రపై ప్రభావం చూపుతుంది. దాల్చిన చెక్క రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, నిద్రపట్టడానికి ఉపకరిస్తుంది.
అల్లం
అల్లంలోని జింజరాల్ అనే రసాయం కడుపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి.. శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఇది నాడీ వ్యవస్థకు మంచిది.
నిమ్మ
ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అడ్రినల్ గ్రంథిని ఉత్తేజపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి ఎక్కువడం వల్ల కూడా ఎదురయ్యే నిద్రలేమి సమస్యను అధిగమించడానికి నిమ్మ తోడ్పడుతుంది.
పాలు
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం.. నిద్రించడానికి నాలుగు గంటల ముందు వ్యాయామం చేయడం వల్ల కూడా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.