Face Glow Tips:ముఖం,మెడ,చేతులు,పాదాల మీద ఉన్న సన్ టాన్, మురికి,జిడ్డు 5 నిమిషాల్లో పూర్తిగా మాయం అవుతుంది
Lemon Remove Sun Tan Tips In telugu : సన్ టాన్ అనేది ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య. కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు.. చర్మం నల్లగా మారుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఎంత మంచి సన్ స్క్రీన్ లోషన్ రాసినా దాని ప్రభావం కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది.
కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులువుగా సన్ టాన్ నుండి బయట పడవచ్చు. దీని కోసం తొక్క తీయకుండా బంగాళాదుంపను తీసుకొని తురిమి రసం తీయాలి. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల బంగాళాదుంప రసం,ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే షాంపూ, అరస్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ శనగపిండి లేదా Multani Mitti వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని సన్ టాన్ ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక నీటిని జల్లుతు రబ్ చేస్తూ చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా సన్ టాన్ తొలగిపోవటమే కాకుండా మురికి,జిడ్డు వంటివి కూడా తొలగిపోయి చర్మం తెల్లగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
సన్ టాన్ కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.