Kitchenvantalu

Banana Barfi:బనానాతో బర్ఫీ.. సింపుల్‌గా, క్షణాల్లో చేసుకోవచ్చు

Banana Barfi:బనానా బర్ఫీ..ఇంట్లో ఉన్న పదార్ధాలతోటే ఎన్నో వెరైటీ స్వీట్స్ తయారు చేసుకోవచ్చు.బర్ఫీ అనగానే కాజు బర్ఫీలే గుర్తొస్తాయి .కాని బనానాతో బర్ఫీ ఎప్పుడైన ట్రై చేసారా .ఈ సారీ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
అరటి పండ్లు – 3
చక్కెర – ½ కప్పు
పాలు – 2 కప్పులు
కొబ్బరి పౌడర్ – ½ కప్పు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా

తయారీ విధానం
1.అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోని మెత్తగా మాష్ చేసుకోవాలి.
2.అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోని రెండు కప్పుల పాలను వేసి మరిగించుకోవాలి.
3.పాలు మరిగాక మాష్ చేసుకున్న అరటి పండ్లను వేసి కలుపుకోవాలి.
4.కలుపుతూ మీడియం ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.

5.మిశ్రమం కాస్తా చిక్కపడ్డాక అందులోకి కొబ్బరి పొడి వేసి నిమిషం పాటు కలుపుకోని ,చక్కెర కూడ యాడ్ చేసుకోవాలి.
6.చక్కెర కరిగాక యాలకుల పొడి వేసి చిక్కపడ్డాక చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి.
7.స్టవ్ ఆఫ్ చేసుకోని ఒక ట్రేలో నెయ్యి అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ట్రే అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి.
8.బర్ఫీ పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
9.రెండు గంటల తర్వాత ఇష్టమైన షేప్స్ లో బర్ఫీని కట్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.