Tollywood:కృష్ణ “ముద్దాయి” సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో…?
Super star Krishna Muddaayi Movie : సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి, రాధ నటించిన ముద్దాయి సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. నటుడిగా కృష్ణ స్థాయిని పెంచడమే కాదు, కలెక్షన్స్ కూడా ఫాన్స్ గర్వపడేలా చేసింది. కన్నడలో విష్ణు వర్ధన్, శ్రీప్రియ జంటగా నటించిన జిమ్మిగల్లు మూవీ 1982లో వచ్చింది. ఇది ప్లాప్ అయినప్పటికీ నిర్మాత వైవిరావు రీమేక్ హక్కులు కొన్నారు.
కొన్ని మార్పులు చేసి తెలుగులో తీయాలని భావించి చిరంజీవి,బాలకృష్ణ, మోహన్ బాబు లకు ఈ మూవీ చూపించారు. మార్పులు చేస్తామని చెప్పినా వారు నటించడానికి నో చెప్పేసారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కథలో మార్పులు చేసారు. ముఖ్యంగా కన్నడంలో మగ పాత్రను తెలుగులో ఆడపాత్రగా మలిచారు. ఆ పాత్రను ఊర్వశి శారద పోషించారు.
ఇక హీరో కృష్ణ కు కథ నచ్చి డేట్స్ ఇచ్చారు. కె ఎస్ ఆర్ దాస్ ని డైరెక్టర్ గా ఎన్నుకుని, విజయశాంతి, రాధ హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసారు. ముద్దాయికి, నేరస్తుడికి మధ్య గల తేడా గురించి జరిగే సంఘర్షణే ముద్దాయి మూవీ. ఖైదీగా కృష్ణ, లాయర్ గా విజయశాంతి, జైలర్ గా శారద, పోలీసాఫీసర్ గా శరత్ బాబు నటించారు.
డాక్టర్ పాత్రలో రాధ నటించిన ముద్దాయి మూవీని వడ్డే బాలాజీరావు నిర్మించారు. 1987జులై 3న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాదు, కనీవినీ ఎరుగని వసూళ్లను సాధించింది. ఒకరి దృష్టిలో ప్రేమమూర్తిగా, మరొకరి దృష్టిలో నేరస్తుడిగా రెండు విభిన్న గెటప్స్ లో కృష్ణ అద్భుత నటన కనబరిచారు. హైదరాబాద్, తెనాలి, మచిలీపట్నం, భీమవరం ఇలా అన్నీ కేంద్రాల్లో కెల్క్షన్స్ రాబట్టింది. 26సెంటర్స్ లో 100డేస్ ఆడింది.