Healthhealth tips in telugu

After 40 Diet Plan:నలభై తర్వాత డైటింగ్ తప్పనిసరిగా చేయాలా?ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?

After 40 Diet Plan:నలభై సంవత్సరాలు వచ్చేసరికి అందరూ వయస్సు అయిపోయిందని భావిస్తారు. అప్పటి వరకు సన్నగా,నాజుగ్గా ఉండటానికి చేసిన ప్రయత్నాలన్నింటికి చెక్ పెట్టేస్తారు. పలితంగా ఊబకాయం త్వరగా వచ్చేస్తుంది.

అయితే స్త్రీలు నలభై సంవత్సరాలకి ముందు డైటింగ్ చేయటం కన్నా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత చేయటం మంచిది. నలభై తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవంటే తప్పనిసరిగా డైటింగ్ చేయాలి. సన్నగా ఉన్న సరే ఈ వయస్సులో ఆహార నియంత్రణ తప్పనిసరి.

ఇటివల ఒక పరిశోదనలో నలభై దాటినా మహిళల్లో కొవ్వు,అధిక బరువు పెరగటం గమనించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు తీసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకుందాము.

ఎన్ని కేలరీలు అవసరం?
నలభై సంవత్సరాలు దాటినా మహిళలు రోజు తీసుకొనే ఆహారంలో 100 కేలరిలను తగ్గించాలి. వీరికి రోజుకి 1800 నుంచి 2000 కేలరీలు అవసరం అవుతాయి. తేలికపాటి వ్యాయామాలు వ్యాయామాలు చేస్తూ పై విధంగా కేలరీలు తీసుకుంటే అధిక బరువును నియంత్రించుకోవచ్చు.

రోజు మొత్తం మీద ఎన్ని కేలరీలు తీసుకోవాలనేది వారి ఎత్తు,బరువు మీద ఆదారపడి ఉంటుంది. ఎవరైనా డైటిషియన్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే కేలరిలను తగ్గించటం చేయాలి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
* తక్కువ కొవ్వు,కేలరీలు లభించే ఆహారం తీసుకోవాలి.
* వేపుడు పదార్దాలకు దూరంగా ఉంటే మంచిది.
* ఈ వయస్సులో ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. ఇందులో పూరి,వడ వంటి నూనె పదార్దాలు కాకుండా ఇడ్లి,ఉప్మా లాంటివి తీసుకోవాలి. పండ్ల జ్యూస్ లకు బదులుగా పండ్లను తీసుకోవాలి.
* కాఫీ,టీ లను తగ్గించేయాలి. అయితే కాఫీ కన్నా టీ మంచిది. రోజులో రెండు మూడు కప్పుల టీ ని మాత్రమే తీసుకోవాలి.
* ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకోకుండా నాలుగు భాగాలుగా తీసుకోవాలి.
* గింజలు,చేపలు,ఓట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చాలి.
* రోజు మొత్తం మీద ఏడు,ఎనిమిది గ్లాసుల నీరు త్రాగితే మంచిది. మధ్యాహ్నం స్నాక్స్ బదులు పళ్ళను తీసుకుంటే బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.