Mysore Masala Dosa:హోటల్ సీక్రెట్ మైసూర్ మసాలా దోశ… పిండి నుండి మసాలా వరకు పక్కాకొలతలు
Mysore Masala Dosa: సౌత్ ఇండియా ఫేవరేట్ టిఫిన్స్ లో, మెయిన్ గా కనిపించేది దోశ. ప్లెయిన్ దోశ మొదలు, ఆనియన్, మసాలా దోసలు, దక్షిణాదిలో చాలా ఫేమస్, అయితే హోటల్ దోశ టేస్ట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంట్లోనే అంతకంటే టేస్టీగా మైసూరు మసాలా దోశ మదిని దోస్తుంది. ఈ దోశ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్దాలు
మిసపప్పు – ½ కప్పు
ఇడ్లీ బియ్యం – 1 కప్పు
దోశల బియ్యం- 1 కప్పు
మెంతులు – 1 టీ స్పూన్
పచ్చిశనగపప్పు – 2 టీ స్పూన్స్
అటుకులు – ½ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
బటర్ – తగినంత
ఎండుమిరపకాయలు -15
ఉల్లిపాయ తరుగు – ¼ కప్పు
నువ్వులు – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 6
పసుపు – కొద్దిగా
నిమ్మరసం -1 టేబుల్ స్పూన్
జీలకర్ర -1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ఉడికించిన బంగాళ దుంపలు – 4
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా దోశపిండి కోసం, బియ్యం, పప్పులు శుభ్రంగా కడిగి, 5 గంటల పాటు నానబెట్టి, నానిన తర్వాత గ్రైండర్ లో వేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ, దోశ పిండి తయారు చేసుకోవాలి.
2. మెత్తగా రుబ్బుకున్న పండిని 12 గంటల పాటు పులవనివ్వాలి.
3. 12 గంటల తర్వాత పులిసిన పిండిని తీసుకుని, అందులోకి రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు వేసి, దోశ కంసిస్టెన్సీ లో కలపుకోవాలి.
4. ఇప్పుడు దోశ కారం కోసం , కొద్దిగా నూనె వేడి అందులో శనగపప్పు, ఉల్లిపాయ తరుగు, వేసుకుని, వెల్లుల్లి రెబ్బలు, వేసి వేగాక పక్కనపెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఎండు మిరపకాయలను వేడి నీటిలో నానబెట్టి, నానిన ఎండుమిరపకాయలను మిక్సీ జార్ లోకి తీసుకోవాలి,
6. ఇప్పుడు అందులోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు , నిమ్మరసం నీళ్లతో, మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.
7. ఇప్పుడు ఆలు కూర కోసం, నూనె వేడి చేసి అందులో అవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి కలుపుకోవాలి.
8. అందులోకి ఉల్లిపాయ తరుగు వేసి 3 నిముషాలు వేగనివ్వాలి.
9. అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు, ఉప్పు వేసి , మరో రెండు నిముషాలు వేపు కోవాలి.
10. తర్వాత అందులోకి ఉడికించిన ఆలుగడ్డలను మ్యాష్ చేసుకుని, కొద్దిగా నీళ్లు చల్లుకుని, బాగా కలిపి, కొత్తిమీర పచ్చిమిర్చి తరుమువేసి దించేసుకోవాలి.
11. ఇ ప్పుడు స్టవ్ పై దోశ పెనం పెట్టుకుని, కొద్దిగా ఆలియల్ వేసి ఉల్లిపాయతో, పాన్ అంతా రుద్దాలి.
12. తర్వాత ప్యాన్ పై దోశపిండి పోసి, స్ప్రెడ్ చేసుకోవాలి.
13. పిండి పోసిన వెంటనే తయారు చేసుకున్న కారం పేస్ట్ వేసి, దోశ మొత్తానికి, అప్లై చేసుకోవాలి.
14. దోశ అంచులను నూనె వేసుకుని మధ్యలో బటర్ వేసి, అట్లకాడతో, ఎర్రగా కాలనివ్వాలి.
15. ఎర్రగా కాలిన బటర్ లోకి, మసాలా కర్రీ యాడ్ చేసుకుని, దోశను కోట్ చేసుకుంటే, మైసూరు మసాలా దోశ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News