Most Eligible Bachelors: ప్రభాస్ సహా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు వీరే..
Most Eligible Bachelors: తెలుగు సినీ పరిశ్రమలో ఒకొక్కరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ సంవత్సరం శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి హీరోలు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ అయినా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు 2024 లో అయినా పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్.. వయసు 44 దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గానే ఉన్నాడు. సలార్ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ.. వయసు 33 ఇతను కూడా పెళ్లి మాట ఎత్తటం లేదు. సందీప్ కిషన్.. వయసు 35.. ఇతను కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి గురించి అసలు మాట్లాడటం లేదు.
సాయి ధరమ్ తేజ్.. వయసు 37 రోడ్ యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే వరుస సినిమాలతో ట్రాక్ ఎక్కాడు. పెళ్లి గురించి పుకార్లు షికార్ చేసినా సరే.. పెళ్లి గురించి ఏమి మాట్లాడటం లేదు. ఈ ఇయర్ ‘విరూపాక్ష’తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా అంతగా మెప్పించలేదు.
అల్లు శిరీష్.. వయసు 35.. అల్లు ఫ్యామిలీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అడివి శేష్.. వయసు 37.. తెలుగులో క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుకెళుతున్న ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో లవ్ లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. మరి 2024లో అడివి శేష్.. ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.
ఇంకా నారా రోహిత్,సుశాంత్,రాజ్ తరుణ్,తరుణ్,అక్కినేని అఖిల్ వంటి ఎంతో మంది హీరోలు పెళ్లి మాట ఎత్తకుండా కెరీర్ అంటూ పరుగు పెడుతున్నారు. 2024 లో అయినా వీరు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పుతారని..