Tollywood Heroine: టాలీవుడ్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న చిన్నది.. ఎవరో గెస్ చేయండి..
Tollywood Heroine Sreeleela::టాలీవుడ్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న చిన్నది sreeleela వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నది. క్రేజీ ప్రాజెక్ట్స్ తో 2024 లో అభిమానుల ముందుకు రానున్నది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించింది.
ఈ సంవత్సరం స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ సినిమాలతో అభిమానులను పలకరించింది. రీసెంట్‌గా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీతో పలకరించింది. ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీలు ఫ్లాపు కావడంతో ఈ భామ ఆశలన్ని రాబోయే మహేష్ బాబు సినిమా గుంటూరు కారం పైనే ఉంది.
శ్రీలీల రీసెంట్‌గా ధమాకా మూవీతో ఉత్తమ నటిగా సైమా అవార్డును కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా నటిస్తుంది.
భగవంత్ కేసరి మూవీ సక్సెస్‌తో శ్రీలీల తన రెమ్యునరేషన్ పెంచేసింది. ఈ సినిమాకు కోటిన్నర వరకు తీసుకున్న ఈ భామ.. ఇకపై చేయబోయే సినిమాలకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే MBBS చదువుతోంది. వచ్చే యేడాది ఈమె డాక్టర్ పూర్తయ్యే అవకాశాలున్నాయి.