Brahmanandam Assets: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించాడో తెలుసా?
Brahmanandam Assets : టాలీవుడ్ లో ఒకప్పుడు రేలంగికి ఎంతటి ఇమేజ్ ఉండేదో అంతలా ఈ జనరేషన్ లో బ్రహ్మానందం అలా మారాడు. బ్రహ్మీ గా పాపులర్ తెచ్చుకున్న బ్రహ్మానందం ఒకదశలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిపోయాడు. తక్కువ సమయంలో దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కారు. ఒక్కో కాల్షీట్ కి రూ. లక్ష చార్జ్ చేస్తున్నారు.
ఒక్కొసారి ఒక సినిమాకే ఈయన రూ. కోటి వరకు పారితోషకం తీసుకున్న సందర్భాలున్నాయి. ఇక్కడో ఇంకో విషయం చెప్పాలి. అదేమిటంటే,ఎంతటి సన్నిహితులైనా సరే, బ్రహ్మానందం ఒక్క పైసా వదలు కోలేదట. డబ్బిస్తేనే యాక్టింగ్ అన్న రేంజ్ లో బ్రహ్మీ కెరీర్ సాగింది. దాంతో సినీ రంగం తెచ్చిపెట్టిన సొమ్ముని కొన్ని రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు మరికొన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు.
ఎలా చూసినా స్థిర, చరాస్థులు చూస్తే, దాదాపు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు బ్రహ్మానందం కూడబెట్టాడని అంటారు. అంతేకాదు డబ్బు విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరంచిడంతో పాటు మరే దురలవాట్లు కూడా లేకపోవడం వలన బ్రహ్మానందం ఈ రేంజ్లో ఆస్తులు కూడబెట్టినట్టు టాక్. ఇప్పటికీ బ్రహ్మీ తెర మీద ఆయన కనిపిస్తే చాలు, థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే.
క్లాస్, మాస్ తేడా లేకుండా అందరితో విజిల్స్ వేయించగల స్టార్ కమెడియన్ గా బ్రహ్మీ పేరుతెచ్చుకున్నారు. ఆమధ్య ముంబైలో హార్ట్ ఆపరేషన్ తో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బ్రహ్మానందం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఎందుకంటే, స్థాయికి తగిన పాత్రలు రాకపోవడం,వెన్నెల కిషోర్, సప్తగిరి, శకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి యువ కమెడియన్ల ఎంట్రీ ఇవ్వడం వంటి కారణాల వలన ఛాన్స్ లు కూడా తగ్గాయి.
‘అల వైకుంఠపురములో’ మూవీలో కాసేపు మెరిశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ యేడాది ఈ సినిమా విడుదల అవుతుంది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన మంచి, చెడు రెంటింటీని స్పృశిస్తూ ఆత్మకథ రాస్తున్నట్టు టాక్. తనకు నచ్చిన రోల్స్ మాత్రమే చేస్తూ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నాడు.